https://www.teluguglobal.com/h-upload/old_images/500x300_124638-anjeer.webp
2019-04-16 21:18:13.0
ఆరోగ్యం పట్ల కొంచెం శ్రధ్ద ఉంటే ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం అంజీర పండు గురించి తెల్సుకుందాం. దీనిని హిందీలో అంజీర్ అని, ఇంగ్లీష్ లో ఫిగ్ అని, తెలుగులో సీమ మేడిపండు అని అంటారు. ఇది మాములు పండులాగా తినవచ్చు. డ్రైఫ్రూట్ లా కూడా తినవచ్చు. కొన్ని పళ్లు ఎండిన తర్వాత వాటిలో పోషక విలువలు రెట్టింపు అవుతాయి. అంజీర్ కూడా ఆ కోవలోకే వస్తుంది. అంజీర్ లో […]
ఆరోగ్యం పట్ల కొంచెం శ్రధ్ద ఉంటే ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు మనం అంజీర పండు గురించి తెల్సుకుందాం. దీనిని హిందీలో అంజీర్ అని, ఇంగ్లీష్ లో ఫిగ్ అని, తెలుగులో సీమ మేడిపండు అని అంటారు.
ఇది మాములు పండులాగా తినవచ్చు. డ్రైఫ్రూట్ లా కూడా తినవచ్చు. కొన్ని పళ్లు ఎండిన తర్వాత వాటిలో పోషక విలువలు రెట్టింపు అవుతాయి. అంజీర్ కూడా ఆ కోవలోకే వస్తుంది.
- అంజీర్ లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీని వల్ల అనేక రోగాలకు చెక్ పెడుతుంది.
- అధిక రక్తపోటుతో బాధపడేవారు అంజీర్ పండు తింటే రక్తపోటు అదుపులోకి వస్తుంది.
- అంజీర్ లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కొన్ని రకాల రుగ్మతలను నివారిస్తుంది.
- నిద్ర లేమితో బాధపడుతున్నవారు రోజూ అంజీర్ పండు తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
- శరీరంలో వేడిని తగ్గించేందుకు అంజీర్ ఎంతో ఉపయోగపడుతుంది.
- రక్తంలో హెమోగ్లోబిన్ స్దాయిలను పెంచి, రక్తహీనతను నివారిస్తుంది.
- శరీరంలో అధిక కొలెస్ట్ర్రాల్ ను తగ్గిస్తుంది.
- తాజా పళ్లతో పోలిస్తే… డ్రై ఫ్రూట్ లోనే అధిక క్యాలరీలు, పోషకాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
- తాజా పళ్లలో 60 క్యాలరీలు ఉంటే .. ఎండిన అంజీర్ లో 200 పైగా క్యాలరీలు ఉన్నట్లు నిర్దారించారు.
- అంజీర్ ను పాస్తా, సలాడ్, ఓట్ మీల్ వంటి వాటితో కలిపి తింటే ఎంతో ప్రయోజనం.
- ఎముకల బలహీనతతో బాధపడేవారు రోజూ అంజీర్ పండు తింటే ఎముకలు బలపడతాయి.
- దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దూరం చేయడంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తుంది.
- కిడ్నీలో రాళ్లు కరగాలంటే అంజీర్ పండు దివ్యౌషధం.
- అంజీర్ పళ్లు స్త్రీ, పురుషులు ఇధ్దరకి కూడా సంతాన సాఫల్యతను పెంచుతుంది.
- అంజీర్ పండుతో గుండె సమస్యలు దూరం అవుతాయి.
anjeer
https://www.teluguglobal.com//2019/04/17/anjeer/