చందమామపై టెంపరేచర్‌ ఎంతో తెలుసా..ఇదిగో ల్యాండర్‌ పంపిన వివరాలు..!

https://www.teluguglobal.com/h-upload/2023/08/27/500x300_816505-chandrayaan-3.webp

2023-08-27 17:51:04.0

చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 ల్యాండర్‌ రోజుకో అప్డేట్ ఇస్తోంది. ఆదివారం అందించిన సమాచారంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే టెంపరేచర్‌ వివరాలు ఉన్నాయి.

చంద్రుడిపై అడుగుపెట్టిన చంద్రయాన్‌-3 ల్యాండర్‌ రోజుకో అప్డేట్ ఇస్తోంది. ఆదివారం అందించిన సమాచారంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే టెంపరేచర్‌ వివరాలు ఉన్నాయి. విక్రమ్‌ ల్యాండర్‌లోని చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌- పేలోడ్‌..చందమామ ఉపరితలంపై, కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల వివరాలను గ్రాఫ్‌ రూపంలో వెల్లడించింది. చంద్రుని ఉపరితలంలో లోతుకు వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గడం ఈ గ్రాఫ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమాచారం ద్వారా చంద్రుడి ఉపరితలంపై థర్మల్ బిహేవియర్‌‌ను అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు సులభం అవుతుంది.

చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌లో దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు ఉంటాయని, అవే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలను గుర్తిస్తాయని ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. లూనార్ సౌత్‌ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే ఫస్ట్‌ టైం అని చెప్పింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలుగా ఉందని వెల్లడించింది.

చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌ పేలోడ్‌ను తిరువనంతపురంలోని స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, అహ్మదాబాద్‌లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో తయారు చేసినట్లు ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్‌పైన 4, ప్రజ్ఞాన్ రోవర్‌పైన రెండు పేలోడ్స్‌ ఉన్నాయి. మరొకటి ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్. వీటిని వేర్వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించారు.

Temperature,ISRO,Chandrayaan-3,Moon,vikram lander,ChaSTE

https://www.teluguglobal.com//science-tech/chandrayaan-3-chaste-payload-aboard-vikram-lander-measures-lunar-surface-temperature-how-it-works-957781