https://www.teluguglobal.com/h-upload/2022/11/10/500x300_425156-101103.webp
2022-11-10 09:49:26.0
Twitter Official Label: ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు, మీడియా సంస్థలకు అఫిషియల్ అనే ట్యాగ్ కనిపించింది.
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ ఒక ఆటాడుకుంటున్నాను. ఇటీవలే భారీ ధర చెల్లించి ఆ సోషల్ మీడియా సంస్థను హస్తగతం చేసుకున్న తర్వాత సీఈవో పరాగ్ అగర్వాల్‌తో పాటు చీఫ్ లీగల్ అడ్వైజర్ విజయ గద్దెను ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ‘అఫిషియల్ బ్యాడ్జ్’ను ప్రవేశపెట్టిన కొద్ది గంటల్లోనే దాన్ని తొలగించి అందరికీ షాక్ ఇచ్చారు. ట్విట్టర్లో ఖాతాలు కలిగి ఉండే రాజకీయ ప్రముఖులు, సెలెబ్రిటీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఖాతాలకు అఫిషియల్ ట్యాగ్‌ను బుధవారం ప్రవేశపెట్టారు. కానీ, దాన్ని అమలు చేసిన విధానంలో గందరగోళం తలెత్తడంతో ఆ ఫీచర్ తొలగించినట్లు మస్క్ పేర్కొన్నారు.
ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, స్పోర్ట్స్ పర్సనాలిటీలు, మీడియా సంస్థలకు అఫిషియల్ అనే ట్యాగ్ కనిపించింది. అయితే, కొంత మంది ప్రభుత్వేతర వ్యక్తులకు కూడా ఈ ఫీచర్ యాక్టివేట్ చేయడంతో గందరగోళానికి కారణమైంది. ప్రముఖుల ఖాతాలకు నకిలీ అకౌంట్లు పుట్టుకొని రాకుండా ఉండేదుకే ఈ ఫీచర్ ప్రవేవపెట్టారు. గతంలో చాలా మంది సెలెబ్రిటీలకు ‘బ్లూ టిక్‘ను ఉచితంగా అందించే వాళ్లు. అయితే, ఇటీవల 8 డాలర్లు చెల్లిస్తే ఇతరులకు కూడా బ్లూ టిక్ ఇస్తామని ప్రకటించింది. దీంతో నకిలీ ఖాతాలు నిర్వహించే వాళ్లు కూడా బ్లూ టిక్ కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. కానీ, ఆ టిక్ ఫ్రీగా వచ్చిందా లేదా చెల్లింపుల ద్వారా తెచ్చుకున్నారా అనే విషయాలను కూడా తెలియజేసింది.
ఇప్పుడా బ్లూ టిక్‌తో పాటు కింద అఫిషియల్ ట్యాగ్ కూడా మొదలు పెట్టింది. దీంతో సామాన్య ఖాతాదారులు తీవ్ర గందరగోళంలో పడిపోవడంతో ప్రస్తుతానికి అఫిషియల్ బ్యాడ్స్ ఫీచర్ తొలగించినట్లు మస్క్ ప్రకటించారు. కాగా, రాబోయే రోజుల్లో చాలా ఫీచర్లను ఇలా ప్రవేశపెట్టి టెస్ట్ చేస్తామని, అవసరం అయితే గంటల వ్యవధిలో తొలగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మస్క్ ప్రకటించారు. కొన్ని నెలల పాటు యూజర్లు ఈ కన్ఫ్యూజన్ను భరించక తప్పదని మస్క్ తెలిపారు. నకిలీల బెడద నుంచి ట్విట్టర్‌ను కాపాడటమే తన అంతిమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
Twitter,Elon Musk,Twitter Official Label,Twitter Blue Tick
https://www.teluguglobal.com//science-tech/twitter-pauses-official-labels-on-select-accounts-356537