https://www.teluguglobal.com/h-upload/2023/11/20/500x300_859054-car-safety-features.webp
2023-11-21 05:39:17.0
Car safety features | దేశంలో కార్ల అమ్మకాలు ఏటా పెరుగుతూ పోతున్నాయి. అయితే కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లు ముందుగా చెక్ చేసుకోవాల్సిన సేఫ్టీ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి.
Car safety features | ఒకప్పుడు కారు అంటే లగ్జరీ. కానీ, ఇప్పుడు కారు కనీస అవసరంగా మారిపోయింది. దేశంలో కార్ల అమ్మకాలు ఏటా పెరుగుతూ పోతున్నాయి. అయితే కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లు ముందుగా చెక్ చేసుకోవాల్సిన సేఫ్టీ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రోడ్డు ప్రయాణాలు రిస్క్‌తో కూడుకున్నవి. కాబట్టి కారులో ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉంటే అంత మంచిది. ముందుగా కారు కొనేముందు దాని బ్రాండ్, స్పీడ్ వంటి విషయాలతోపాటుగా దాని సేఫ్టీ ర్యాంకింగ్ ఎంత అనేది కూడా చూసుకోవాలి. కార్లలోని సేఫ్టీ ఫీచర్ల ఆధారంగా గ్లోబల్ ‘ఎన్‌సీఎపీ’ రేటింగ్ ఇస్తారు. కొనబోయే కారుకి కనీసం నాలుగు స్టార్ల రేటింగ్ అయినా ఉండాలి. ఐదు స్టార్లు ఉంటే ఇంకా మంచిది.
కారులో ప్రతీ సీటుకి ఎయిర్ బ్యాగ్స్ ఉండాలి. ఇప్పుడొస్తున్న చాలా కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి. ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌తో పాటు సైడ్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. ఇలా ఎన్ని ఎక్కువ బ్యాగ్స్ ఉంటే అంత సేఫ్.

కారులో ఉండాల్సిన మరో సేఫ్టీ ఫీచర్.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. కారు వేగంగా వెళ్తున్నప్పుడు స్టీరింగ్ అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ ఫీచర్ పనికొస్తుంది. స్టీరింగ్ ఆటోమేటిక్‌గా టర్న్ అవ్వకుండా కంట్రోల్ చేసి కారు దొర్లకుండా కాపాడుతుంది.
కారులో తప్పనిసరిగా కెమెరాలు, సెన్సార్లు ఉండాలి. ముందు లేదా వెనుక వైపు ఏదైనా అడ్డు వస్తే అలర్ట్ చేసే సెన్సర్లు, పార్కింగ్ అసిస్టెన్స్, ఆటోమేటిక్ స్టాపింగ్ వంటి ఫీచర్లు ఇప్పుడు చాలా కార్లలో వస్తున్నాయి.
కారులో బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎంతో ముఖ్యమైన విభాగం. ముఖ్యంగా కారుకి ‘యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్)’ తప్పక ఉండాలి. సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు టైర్లు జారిపోయి కారు అదుపు తప్పకుండా ఈ టెక్నాలజీ కాపాడుతుంది.

ఇక వీటితోపాటు ‘టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్’ అనే ఫీచర్.. టైర్లలో ఎంత ప్రెజర్ ఉంది అనేది తెలియజేస్తుంది. ‘ట్రాక్షన్ కంట్రోల్’ అనే ఫీచర్ అన్ని టైర్లు ఒకే స్పీడ్‌తో తిరిగేలా చూస్తుంది. స్కిడ్ అవ్వడాన్ని తగ్గిస్తుంది. పిల్లలు సీట్లోనుంచి జారిపోకుండా ‘ఐసోఫిక్స్ మౌంట్స్’ ఉండాలి. ఇలాంటి ఫీచర్లు అన్నీ ఉంటే అది సేఫ్ కారు కింద లెక్క.

Car,Car Safety Features,Vehicle Safety Features
car, Car Safety Features, Safety Features, vehicle safety features, telugu news, telugu global news, latest news, cars, upcoming, upcoming cars, upcoming car news, news, latest news
https://www.teluguglobal.com//business/buying-a-car-here-are-some-must-have-safety-features-you-should-check-before-975488