https://www.teluguglobal.com/h-upload/2023/11/03/500x300_850662-ai-tools.webp
2023-11-03 12:00:38.0
రెజ్యూమెని అట్రాక్టివ్‌గా క్రియేట్ చేసేందకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. దానికోసం బోలెడు ఏఐ టూల్స్ రెడీగా ఉన్నాయి.
మెరుగైన ఉద్యోగావకాశాలు పొందాలంటే ముందుగా కావాల్సింది అట్రాక్టివ్ రెజ్యూమె. అభ్యర్థుల ప్రొఫైల్ ఎంత అట్రాక్టివ్‌గా ఉంటే అన్ని ఎక్కువ అవకాశాలు పొందేందుకు వీలుంటుంది. అయితే రెజ్యూమెని అట్రాక్టివ్‌గా క్రియేట్ చేసేందకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. దానికోసం బోలెడు ఏఐ టూల్స్ రెడీగా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..
ఒక ఉద్యోగానికి వందల కొద్దీ అప్లికేషన్లు వస్తాయి. కానీ, అందులో మొదటి దశ ఫిల్టరేషన్ జరిగేది రెజ్యూమె దగ్గరే. ప్రొఫెషనల్ రెజ్యూమె ఉన్నవాళ్లు ముందుగా ఇంటర్వ్యూ కాల్కి సెలక్ట్ అవుతారు. మరి అలాంటి ప్రొఫెషనల్ రెజ్యూమెని చిటికెలో రెడీ చేయాలంటే కొన్ని ఏఐ టూల్స్ సాయం తీసుకోవాలి. వాటిలో కొన్ని ఇవీ..
రెజ్యూమేకర్.ఏఐ
‘రెజ్యూమేకర్ డాట్ ఏఐ (resumaker.ai)’ అనే వెబ్సైట్ సాయంతో రకరకాల ప్రొఫెషనల్ టెంప్లేట్స్‌లో మీ రెజ్యూమెని క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో డేటా ఎన్క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. అంటే రెజ్యూమె కోసం మీరిచ్చే డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా సేఫ్‌గా ఉంటుంది.
రెజ్యూమె.ఐవో
‘రెజ్యూమె డాట్ ఐవో(resume.io)’ అనేది పాపులర్ ఏఐ రెజ్యూమె టూల్. ఇందులో బోలెడన్ని ప్రొఫెషనల్ టెంప్లేట్స్‌తో పాటు కవర్ లెటర్లు కూడా ఉంటాయి. రెజ్యూమెలో స్పెల్లింగ్ చెక్, గ్రామర్ చెక్ వంటివి కూడా సరిచూసుకోవచ్చు.
కాన్వా
‘కాన్వా(canva.com)’ అనేది గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్‌ఫామ్. అయితే ఇందులోని రెజ్యూమె మేకర్ టూల్ సాయంతో అందమైన రెజ్యూమెను డిజైన్ చేసుకోవచ్చు. కంటెంట్‌తో పాటు రెజ్యూమె డిజైన్ కూడా క్రియేటివ్‌గా ఉండాలనుకుంటే ఈ టూల్ ట్రై చేయొచ్చు. ఇందులో ఫాంట్, లేఅవుట్, గ్రాఫిక్స్.. ఇలా రకరకాల టూల్స్‌తో రెజ్యూమెను డిజైన్ చేయొచ్చు.
రెజీ
‘రెజీ డాట్ ఏఐ(rezi.ai)’ అనేది ‘ఓపెన్ ఏఐ’ జీపీటీ సపోర్ట్‌తో పనిచేస్తుంది. మీ ఎడ్యుకేషన్ వివరాలు, జాబ్ ప్రొఫైల్ నేమ్.. ఇలా బేసిక్ వివరాలు అందజేస్తే.. నిమిషంలో ప్రొఫెషనల్ రెజ్యూమె రెడీ చేస్తుంది. అలాగే ఇందులో రకరకాల టెంప్లేట్స్, ప్రీ కంపోజ్డ్ సెంటెన్స్లు అందుబాటులో ఉంటాయి.
AI Tools,Resume,AI CV Maker,Rezi AI Resume Builder,Resumaker AI,Canva
AI Tools, Resume, Resume tips, Resume telugu, AI Tools for Resume Builder, telugu news, telugu global news, today news, Free AI CV Maker, AI CV Maker, Rezi AI Resume Builder, Resumaker AI, canva
https://www.teluguglobal.com//business/best-ai-tools-for-attractive-resume-builder-971887