https://www.teluguglobal.com/h-upload/2023/10/28/500x300_847558-maruti-swift-2024.webp
2023-10-28 08:40:05.0
Maruti Swift-2024 | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. అనునిత్యం అధునాతన టెక్నాలజీలో వస్తున్న మార్పులతో ప్రయాణికులకు అనువుగా కార్లను తయారు చేస్తూ.. అగ్రగామిగా నిలుస్తోంది.
Maruti Swift-2024 | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. అనునిత్యం అధునాతన టెక్నాలజీలో వస్తున్న మార్పులతో ప్రయాణికులకు అనువుగా కార్లను తయారు చేస్తూ.. అగ్రగామిగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో హ్యాచ్‌బ్యాక్ బుల్లి కారు `స్విఫ్ట్ (Swift)`కు ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో ఒకప్పుడు పాపులర్ మోడల్ `స్విఫ్ట్`కు మళ్లీ గిరాకీ పెంచడానికి మారుతి సుజుకి మాతృసంస్థ సుజుకి మోటార్స్ కార్పొరేషన్ సిద్ధమైంది. పలు అధునాతన మార్పులతో ఆకర్షణీయంగా రూపుదిద్దింది. 2024లో మార్కెట్లోకి రానున్న 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ కస్టమర్లను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
ఇవీ మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 డిజైన్స్
స్పోర్టీనెస్ లుక్‌తో కూడిన రేర్ బంపర్, ఫ్యామిలియర్ టెయిల్ ల్యాంప్స్, న్యూ బంపర్‌తో స్వెప్ట్ బ్యాక్ హెడ్ ల్యాంప్స్, ఫ్లాట్ విండో లైన్, బాయ్‌నెట్‌తో నీట్‌గా మెర్జింగ్, ఫ్లాట్ విండో లైన్‌తో వస్తున్నదీ స్విఫ్ట్-2024. ఆల్ న్యూ డాష్‌బోర్డ్ లేఔట్, బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్, ఫ్రీ-స్టాండింగ్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ యూనిట్, స్టీరింగ్ వీల్స్, బాలెనో నుంచి ఇన్‌స్ట్రుమెంట్ బిన్నాకిల్, బిజీగా కనిపించే డాష్ బోర్డ్ డిజైన్, అత్యాధునిక అడాస్ సిస్టమ్ తదితర ఫీచర్లు జత చేశారు.

స్విఫ్ట్-2024 న్యూ ఫీచర్లు ఇవే..
స్విఫ్ట్-2024లో న్యూ జేబీఎల్ పవర్డ్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లు జత చేశారు.

ఇలా 2024-స్విఫ్ట్ పవర్‌ట్రైన్ డిజైన్
1.2 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగిస్తారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 90 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. దీంతోపాటు హైబ్రీడ్ పవర్ ప్లాంట్ కూడా ఆఫర్ చేస్తోంది మారుతి సుజుకి. వచ్చే ఏడాది మధ్యలో భారత్ మార్కెట్‌లో స్విఫ్ట్-2024 ఆవిష్కరిస్తారని భావిస్తున్నారు. ఈ కారు ధర రూ.6.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పలుకుతాయని అంచనా వేస్తున్నారు.
Maruti Swift 2024,Maruti Swift,Maruti Suzuki,Car
Maruti Swift 2024, Maruti Suzuki, Maruti Swift, Maruti Swift 2024 Price, Maruti Swift 2024 cost
https://www.teluguglobal.com//business/2024-maruti-suzuki-swift-showcased-at-tokyo-motor-show-970597