https://www.teluguglobal.com/h-upload/2023/09/13/500x300_824278-fuel-payments.webp
2023-09-16 06:20:27.0
పెట్రోల్ బంకులకు వెళ్లినప్పుడు కార్డు లేదా క్యాష్ పేమెంట్‌కు బదులు నేరుగా కారుతోనే చెల్లింపు జరిగేలా కొత్త రకం పేమెంట్ వ్యవస్థను తీసుకురాబోతోంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
పెట్రోల్ బంకులకు వెళ్లినప్పుడు కార్డు లేదా క్యాష్ పేమెంట్‌కు బదులు నేరుగా కారుతోనే చెల్లింపు జరిగేలా కొత్త రకం పేమెంట్ వ్యవస్థను తీసుకురాబోతోంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇదెలా పనిచేస్తుందంటే..
డిజిటల్ పేమెంట్స్ వచ్చాక రకరకాల కొత్త పేమెంట్ పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. అందులోభాగంగానే ఇప్పుడు కార్డు, క్యాష్, ఫోన్ అవసరం లేకుండా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొనుగోలు చేసే సిస్టమ్ రాబోతోంది. ఈ కొత్త డిజిటల్ చెల్లింపుల పద్ధతిని టోన్‌ట్యాగ్ అనే సంస్థ తీసుకొచ్చింది. దీనికి ‘పే బై కార్’ అని పేరు పెట్టారు. ఇది యూపీఐ సపోర్ట్‌తోనే పనిచేస్తుంది. కారులో ఉండే ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌తో యూపీఐ సర్వీసులను లింక్ చేస్తారు. ఇక ఎక్కడికి వెళ్లినా కారులో ఉండే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తోనే పెట్రోల్ కొట్టించుకోవచ్చు, ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఎంజీ మోటార్స్, భారత్ పెట్రోలియం సంస్థలు కలిసి ఇటీవలే ఈ పెమెంట్ వ్యవస్థను ప్రయోగించి చూశాయి. త్వరలోనే ఈ వ్యవస్థ అన్ని కార్లకు విస్తరించనుంది.
ఇలా పనిచేస్తుంది
కారుకి ఈ పేమెంట్ పద్ధతిని లింక్ చేస్తే కారు పెట్రోల్ బంకుకి వెళ్లగానే ఆటోమెటిక్‌గా ఫ్యూయల్ డిస్పెన్సర్ నంబర్ డిస్ప్లే అవుతుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ద్వారా ఎంత ఫ్యూయల్ కావాలో అంత ఎంటర్ చేస్తే.. ఆటోమెటిక్‌గా పేమెంట్ అయిపోతుంది. అలాగే ఫాస్టాగ్ రీఛార్జ్ కూడా. పేమెంట్ అయిన తర్వాత అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Pay by Car,Fuel Payments,payments,UPI
Pay by Car, Fuel Payments, pay by car feature, no card no phone needed for fuel payments, tonetag, amazon, mastercard, tech news, latest tech news, UPI payments using car, ToneTag, UPI payments without phone, UPI without internet, offline payments technology, RBI, Reserve Bank of India, BPCL, Fastag payments, Car payments system
https://www.teluguglobal.com//business/pay-by-car-feature-for-fuel-payments-technology-news-961900