Hero HF Deluxe Canvas Black | మార్కెట్లోకి హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ కాన్వాస్‌.. విత్ సెల్ఫ్ స్టార్ట్‌.. యూఎస్బీ చార్జర్ ఆప్ష‌న్‌!

https://www.teluguglobal.com/h-upload/2023/06/04/500x300_775919-hero-hf-deluxe-canvas-black.webp
2023-06-04 09:14:52.0

Hero HF Deluxe Canvas Black | ప్ర‌ముఖ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ `హీరో మోటో కార్ప్‌` దేశీయ మార్కెట్‌లోకి `హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ క‌న్వాస్ బ్లాక్ (Hero HF Deluxe Canvas Black) బైక్ తీసుకొచ్చింది.

Hero HF Deluxe Canvas Black | ప్ర‌ముఖ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ `హీరో మోటో కార్ప్‌` దేశీయ మార్కెట్‌లోకి `హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ క‌న్వాస్ బ్లాక్ (Hero HF Deluxe Canvas Black) బైక్ తీసుకొచ్చింది. సెల్ఫ్ స్టార్ట్‌, కిక్ స్టార్ట్ ఆప్ష‌న్ల‌లో కూడా ల‌భిస్తుంది. కిక్ వేరియంట్ రూ.60,760 ప‌లుకుతుండ‌గా, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ రూ.66,408ల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన మోటారు సైకిల్ హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ బైక్‌ నాలుగు రంగుల్లో .. నెక్సాస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్‌, హెవీ గ్రే విత్ బ్లాక్‌, బ్లాక్ విత్ స్పోర్ట్స్ రెడ్ రంగుల్లో ల‌భిస్తుంది.

ఆల్ బ్లాక్ థీమ్ విత్ బ్లాక్‌డ్ ఔట్ ఇంజిన్‌, అల్లాయ్ వీల్స్‌, మ‌ఫ్ల‌ర్‌, ఫ్రంట్ ఫోర్క్‌, గ్రాబ్ రెయిల్ వంటి ఫీచ‌ర్లు అన్నీ బ్లాక్ క‌ల‌ర్‌లోనే ఉంటాయి. సైడ్ ప్యానెల్స్ మీద‌ 3డీ హెచ్ఎఫ్ డీల‌క్స్ ఎంబ్లం ఉంటుంది. సెల్ప్, సెల్ఫ్ ఐ3ఎస్ వేరియంట్ బైక్‌ల‌కు ట్యూబ్‌లెస్ టైర్లు స్టాండ‌ర్డ్ ఫీచ‌ర్‌గా ల‌భిస్తుంది. యూఎస్‌బీ చార్జ‌ర్ కూడా యాక్సెస‌రీగా ఇస్తారు. ఇది కొనుగోలుదారుల ఆప్ష‌న్‌ను బ‌ట్టి అందిస్తారు.

హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ బైక్ (Hero HF Deluxe).. 97.2సీసీ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్‌, సింగిల్ సిలిండ‌ర్‌, ఓహెచ్సీ, రెండో ద‌శ బీఎస్‌-6 ప్ర‌మాణాల‌తో కూడిన పీఎఫ్ఐ ఇంజిన్ ఉంటుంది. `ఎక్స్‌సెన్స్ టెక్నాల‌జీ (XSens Technology)తో కూడిన ఈ ఇంజిన్ 5.9 కిలోవాట్ల విద్యుత్‌, 8.05 ఎన్ఎం టార్చి వెలువ‌రిస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ క‌టాఫ్‌, కటాఫ్ ఎట్ పాల్, రేర్ అండ్ ఫ్రంట్ డ్ర‌మ్ బ్రేక్స్ ఫీచ‌ర్లు ఉంటాయి.

హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ (Hero HF Deluxe) బైక్ 9.6 లీట‌ర్ల ప్యూయ‌ల్ టాంక్ విత్ కెర్బ్ వెయిట్ 112 కిలోలు ఉంటుంది. 733ఎంఎం లాంగ్ సీట్‌, 2-స్టెప్ అడ్జ‌స్ట‌బుల్ స‌స్పెన్ష‌న్‌, అల్లాయ్ వీల్స్‌, సైడ్ స్టాండ్ ఇండికేట‌ర్‌, క్రోమ్ లెగ్ గార్డ్‌, టాయ్ గార్డ్, ట్యూబ్ లెస్ టైర్స్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. ఈ మోటారు సైకిల్‌పై ఐదేండ్ల వారంటీ ఉంటుంది. ఐదు ఫ్రీ స‌ర్వీసులు ల‌భిస్తాయి.

వారంటీ వారీగా హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ బైక్ ధ‌ర‌లు ఇలా

హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ డ్ర‌మ్ కిక్ : రూ.60,760

హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ డ్ర‌మ్ సెల్ఫ్: రూ. 66,408

హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ ఐ3ఎస్ డ్ర‌మ్ సెల్ఫ్ : 67,908

హీరో హెచ్ఎఫ్ డీల‌క్స్ గోల్డ్ బ్లాక్‌: రూ. 67,208

Hero HF Deluxe Canvas Black,Hero HF Deluxe,Hero MotoCorp,Hero HF Deluxe Offers
Hero HF Deluxe,Hero HF Deluxe Black Canvas,Hero MotoCorp,Hero Motorcycles,100 cc commuter motorcycles,affordable motorcycles,Hero HF Deluxe specs,Hero HF Deluxe features,Hero HF Deluxe price,Hero HF Deluxe deliveries,Hero HF Deluxe offers

https://www.teluguglobal.com//business/hero-hf-deluxe-canvas-black-launched-four-new-colours-added-937565