https://www.teluguglobal.com/h-upload/2023/02/09/500x300_722656-blunder-by-googles-ai-chatbot-bard-alphabet-shares-lose-100-billion.webp
2023-02-09 15:15:13.0
ఇటీవల ప్రకటించిన `బార్డ్`కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో భారీ తప్పిదం చోటుచేసుకుంది. దీంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫా బెట్ షేర్ ధర బుధవారం భారీ ఒడిదుడులకు గురైంది.
మైక్రోసాఫ్ట్‌కు చెందిన చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ రంగంలోకి తెచ్చిన `బార్డ్` చేసిన పొరపాటు వల్ల గూగుల్‌కు చేదు అనుభవం ఎదురైంది. దానివల్ల భారీ నష్టాన్ని చవిచూసింది. ఇటీవల ప్రకటించిన `బార్డ్`కు సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్లో భారీ తప్పిదం చోటుచేసుకుంది. దీంతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫా బెట్ షేర్ ధర బుధవారం భారీ ఒడిదుడులకు గురైంది. అమెరికా ఎక్స్ఛేంజీలలో ఆల్ఫాబెట్ షేర్లు 8 శాతం కుప్పకూలాయి. దీంతో ఒక్కరోజులోనే ఏకంగా 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మేర మార్కెట్ విలువను కోల్పోయింది.
`బార్డ్` యాప్‌లోని తప్పిదాన్ని తొలుత రాయిటర్స్ గుర్తించింది. సౌర వ్యవస్థ వెలుపలి గ్రహాల చిత్రాలను తొలిసారిగా ఏ శాటిలైట్ తీసిందన్న ప్రశ్నకు `బార్డ్` సరైన సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. `జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్` అని సమాధానం చెప్పింది. కానీ, నాసా ధ్రువీకరించినట్టుగా 2004లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ వెరీ లార్జ్ టెలిస్కోప్ ద్వారా ఎక్సోప్లానెట్ల తొలి చిత్రాలను తీసింది. `బార్డ్`కు సంబంధించి గూగుల్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన GIF వీడియోను `లాంచ్ ప్యాడ్`గా అభివర్ణించింది. ఈ షార్ట్ వీడియోలోనే ఈ పొరపాటు దొర్లింది.
గూగుల్ గత కొన్ని వారాలుగా సెర్చ్‌ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో హడావుడిగా ఇచ్చిన డెమో సమయంలో తప్పు సమాధానాన్ని పోస్ట్ చేయడం గందరగోళానికి దారితీసిందని సీనియర్ సాఫ్ట్వేర్ విశ్లేషకుడు గిల్ లూరియా అన్నారు.
Blunder,By Google,AI Chatbot,’Bard’,Alphabet,Shares,Lose,100 Billion
Blunder, By Google, AI Chatbot, ‘Bard’, Alphabet, Shares, Lose, 100 Billion
https://www.teluguglobal.com//business/blunder-by-googles-ai-chatbot-bard-alphabet-shares-lose-100-billion-893024