త్వరలో మన రోడ్లపై టెస్లా కార్ల పరుగులు

2025-02-18 05:43:35.0

ఐదు పొజిషన్లకు ఉద్యోగ ప్రకటన జారీ చేసిన టెస్లా

ఎంతకాలంగా మన దేశ మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి టెక్‌ దిగ్గజం టెస్లా చేస్తున్న ప్రయత్నాలు సఫలమైనట్లు తెలుస్తోంది. త్వరలో మన దేశ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు పెట్టనున్నాయి. ముంబయి, ఢిల్లీలో ఉద్యోగాల నియామకాలకు ప్రకటనలు ఇచ్చింది. ఇటీవలి అమెరికా పర్యటనలో ప్రధాని మోడీతో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ భేటీ అయిన విషయం విదితమే. వీరివురి సమావేశం జరిగిన కొన్నిరోజులకే ఈ పరిణామం జరగడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కస్లమర్‌ రిలేటెడ్‌, బ్యాక్‌ ఎండ్‌ జాబ్‌ సహా 13 పొజిషన్లకు అభ్యర్థులు కావాలంటూ టెస్లా తమ లింక్‌డిన్‌ పేజీలో ప్రకటన ఇచ్చింది. సర్వీస్‌ టెక్నిషియన్‌, అడ్వైజర్‌ సహా కనీసం ఐదు పొజిషన్లకు ముంబయి, ఢిల్లీలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది. ఇక కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్‌ మేనేజర్‌, డెలివరీ ఆపరేషన్స్‌ స్పెషలిస్ట్‌ వంటి ఉద్యోగులను కేవలం ముంబయి కేంద్రంగా తీసుకోనున్నట్లు టెస్లా ప్రకటించింది. 

Tesla,Begins job hunting in India,Immediately after PM Modi-Musk meeting,Open Showrooms In Delhi & Mumbai