ఐసీఎంఆర్‌ – ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ గా డాక్టర్‌ భారతి కులకర్ణి

2025-01-01 13:58:13.0

బాధ్యతలు స్వీకరించిన కొత్త డైరెక్టర్‌

ఐసీఎంఆర్‌ – ఎన్‌ఐఎన్ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ – నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌) డైరెక్టర్‌గా ఫిజీషియన్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్‌ భారతి పూణే యూనివర్సిటీ నుంచి పిడియాట్రిక్స్‌ లో స్పెషలైజేషన్‌ పూర్తి చేశారు. అమెరికాలోని జాన్‌ హాకిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి పబ్లిక్‌ హెల్త్‌ లో మాస్టర్స్‌ డిగ్రీ, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి డాక్టోరల్‌ డిగ్రీ అందుకున్నారు. 20 ఏళ్లకు పైగా ఆమె ఐసీఎంఆర్‌ – ఎన్‌ఐఎన్‌ లో సైంటిస్ట్‌ గా సేవలందిస్తున్నారు. 

 

ICMR – NIN,Dr. Bharti Kulkarni,New Director,Senior Scientist