ఇంజనీరింగ్‌ మార్వెల్‌.. న్యూ పంబన్‌ బ్రిడ్జి ఇదే!

2024-11-29 12:10:02.0

ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్ చేసిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

రామేశ్వరం పోయివచ్చినోళ్లకు పంబన్‌ బ్రిడ్జి గురించి తెలిసే ఉంటుంది. రామేశ్వరం – మండపం మధ్య సముద్రంలో 2.06 కి.మీ.ల పొడవైన పాత పంబన్‌ బ్రిడ్జిపై నుంచి రైలు వెళ్తుంది. సముద్రంలో వచ్చే షిప్‌ ఆ బ్రిడ్జిని దాటాలంటే 16 మంది కార్మికులు మ్యానువల్‌ గా రైల్వే బ్రిడ్జిని లిఫ్ట్ చేసే వాళ్లు. 1914లో రూ.20 లక్షలతో నిర్మించిన పాత పంబన్‌ బ్రిడ్జి లైఫ్‌ టైమ్‌ అయిపోయింది. 2019లో ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన న్యూ పంబన్‌ బ్రిడ్జి త్వరలోనే సేవలందించడానికి సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే ఒక ఇంజనీరింగ్‌ మార్వెల్‌ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోషల్‌ మీడియా వీడియోలు, ఫొటోలు షేర్‌ చేశారు. ఇది దేశంలోనే మొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జీ. కొత్త పంబన్‌ బ్రిడ్జి ట్రాక్‌ తో సహా ఆటోమేటిక్‌గా పైకి లిఫ్ట్‌ అవుతుంది. ఓడలు వెళ్లేప్పుడు పైకి వెళ్లే బ్రిడ్జి కమ్‌ రైల్వే ట్రాక్‌ సాధారణ సమయాల్లో రైళ్లు రయ్యిన దూసుకుపోయేందుకు అనువుగా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు చూసిన వాళ్లు ఔరా! అంటున్నారు.

 

Pamban Bridge,Rameshwaram,Engineering Marvel,Ashwini Vaishnav