2024-04-09 03:23:44.0
Samsung Galaxy M55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung).. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్‌తోపాటు తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది.
Samsung Galaxy M55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung).. శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్‌తోపాటు తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్లను ఆవిష్కరించింది. ఇంతకుముందు మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎం54 5జీ (Samsung Galaxy M54 5G), శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G) ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ ఫోన్లను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్ ఒక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ (octa-core Qualcomm Snapdragon) చిప్సెట్తో వస్తున్నది. మూడు ర్యామ్ ప్లస్ స్టోరేజీ వేరియంట్లు, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కూడా ఉంటది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌తోపాటు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో కొనుగోలు చేయొచ్చు. డెనిమ్ బ్లాక్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్.
శాంసంగ్ గెలాక్సీ ఎం55 5జీ (Samsung Galaxy M55 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2,400 x 1,080 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ (Qualcomm Snapdragon 7 Gen 1 SoC) చిప్సెట్తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.1 వర్షన్‌పై పని చేస్తుందీ ఫోన్. ఐదేండ్లు సెక్యూరిటీ అప్డేట్స్, నాలుగేండ్లు ఓఎస్ అప్డేట్స్ అందిస్తుంది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), వైడ్ యాంగిల్ లెన్స్ మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా వస్తున్నది. 45 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటది. 5జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
తక్కువ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ
తక్కువ ధరలో స్మార్ట్ పోన్ కొనుక్కోవాలని భావించే వారి కోసం శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్ తీసుకొచ్చింది. రూ.12,999 లకే అందుబాటులోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ కలిగి ఉంటది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తున్నది. రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
Samsung Galaxy M55,Samsung,Smartphone