ట్రంప్‌ టారిఫ్‌ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో సూచీలు

2025-02-14 09:12:06.0

సెన్సెక్‌ 436.27 పాయింట్లు, నిఫ్టీ 229.35 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్‌

స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. భారత్‌ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్‌ టారిఫ్‌లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్‌ సమర్థించుకోవడం మార్కెట్లప తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి.

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సెన్సెక్‌ 436.27 పాయింట్లు తగ్గి 75702.70 వద్ద ట్రేడవుతుంటే.. నిఫ్టీ 229.35 పాయింట్లు కుంగి 22802.05 వద్ద కదలాడుతున్నది. సెన్సెక్స్‌ సూచీలో అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఎన్టీపీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జొమాటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నెస్లే ఇండియా, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.

Trump’s Tariff Effect,Indices of Huge Losses,Stock Market Crash,Sensex off day’s low,down 300pts; SmallCap index slips 3.5%