2025-02-10 05:23:24.0
స్టీల్, అల్యుమినియంపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో దేశీయ సూచీలపై ప్రభావం చూపిస్తున్నాయి. అటు ఈ వారంలో వెలువడనున్న కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలపై దృష్టిపెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో ఈ వారాన్ని సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 23,500 మార్క్ దిగువకు కుంగింది. ఉదయం 10.50 గంటల సమయంలో సెన్సెక్స్ 553.26 పాయింట్ల నష్టంతో 77306.93 వద్ద, నిఫ్టీ 174.40 పాయింట్ల నష్టంతో 23385.55 వద్ద ట్రేడ్ అవుతున్నది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమైంది. ఏకంగా 44 పైసలు క్షీణించి 97.94 వద్ద జీవనకాల కనిష్టానికి పడిపోయింది. నిష్టీలో భారతీ ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటార్స్, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా షేర్లు రాణించగా… జేఎస్‌డబ్ల్యూ, టాటా స్టీల్, సిప్లా, రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. స్టీల్, అల్యుమినియంపై 25 శాతం టారిఫ్ విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఆసియా పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
Stock Markets Updates,BSE Sensex,Nifty50,Metal falls 3%; SMIDs drag up to 2%; Banks weigh