2025-01-31 06:18:22.0
గత బడ్జెట్లో స్వర్ణం దిగుమతిపై సుంకాలను తగ్గించిన ప్రభుత్వం. దీంతో ఒక్కసారిగా పెరిగిన కొనుగోళ్లు
దేశంలో బంగారానికి ఉన్న క్రేజ్ మరే వస్తువుకు ఉండదంటే అతియోక్తి కాదు. 2024 ద్వితీయార్థంలో భారత్‌లో దీని దిగుమతులు భారీగా పుంజుకొన్నాయి. గత బడ్జెట్లో దిగుమతి సంకాలకు కోత వేయడంతో దీనికి ఆజ్యం పోసినట్లైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈసారి దిద్దుబాటు చర్యలు చేపడుతుందని అంచనాలు మార్కెట్లో బలంగా ఉన్నాయి. దీనికితోడు పసిడి కారణంగా జీడీపీకి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో వృద్ధి కూడా పెద్దగా కనిపించకపోవడం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది.
ఇది చాలదన్నట్టు ఇబ్బడిముబ్బడిగా బంగారం దిగుమతి చేసుకోవడంతో ద్రవ్యలోటు, కరెన్సీ పతనానికి దారితీస్తున్నది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలీస్తే రూ. 87 వద్దకు చేరడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. 2024 డిసెంబర్ 16న విడుదలైన వాణిజ్య గణాంకాల్లో రికార్డుస్థాయి లోటు బైటపడింది. దీనికి పసిడి కొనుగోళ్లే కారణమని తేలింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 14.8 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతి చోసుకోగా.. దీనిలో 21 శాతం మాత్రమే వినియోగాల కోసం కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే దీనిని అత్యదికంగా ది గుమతి చేసుకొనే రెండో దేశంగా భారత్ నిలిచిందంటే భవిష్యత్తులో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
గత జులైలో విడుదల చేసిన బడ్జెట్లో స్వర్ణం దిగుమతిపై సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆగస్టులో దిగుమతుల్లో 104 శాతం వృద్ధి కనిపించిందటే కేంద్ర నిర్ణయం ఎఫెక్ట్‌ను అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నెలల్లోనూ దీని కొనుగోళ్లలో వృద్ది కనిపిస్తూనే ఉన్నది.
Budget 2025,Gold more affordable,For the middle class,Union Finance Minister Nirmala Sitharaman,Policies and tax reforms