2025-01-23 10:37:17.0
మీడియా ప్రతినిధుల ప్రశ్నకు వెంకటేశ్ సమాధానం
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై ఐటీ రెయిడ్స్ జరుగుతున్నాయా? అది నిజమా? అని హీరో విక్టరీ వెంకటేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంక్రాంతికి వస్తున్నాం ప్రొడ్యూసర్ దిల్ రాజు సహా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతలు, నిర్మాణ సంస్థలు, వ్యక్తులపై ఐటీ దాడులు జరుగుతున్నాయనే విషయమే తనకు తెలియదన్నారు. ”అయినా నేను మొత్తం వైట్‌లోనే తీసుకుంటా.. నేను వైట్‌లోనే వైట్.. నేను తీసుకునేదే తక్కువ.. అది మొత్తం వైటే.. మిగతా వాళ్ల గురించి నాకు తెలియదు..” అని సమాధానం ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ సందర్భంగా ఐటీ రెయిడ్స్ పై ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తన ఇంటిపై ఐటీ రెయిడ్స్ జరగలేదని దర్శకుడు అనీల్ రావిపూడి తెలిపారు. తాను సుకుమార్ పక్కింట్లో ఉండనని కూడా చెప్పారు. తాము సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీశామని.. ఐటీ వాళ్లు సంక్రాంతికి వస్తున్నామని సోదాలు చేస్తున్నారని తెలిపారు. సినిమా నిర్మాణ సంస్థలు, వ్యాపారవేత్తలపై ఐటీ దాడులు జరగడం సాధారణమేనని తెలిపారు. ప్రతి రెండు, మూడేళ్లకోసారి ఇలాంటి దాడులు జరుగుతుంటాయని చెప్పారు.
IT Raids,Film Industry,Hero Venkatesh,Anil Ravipudi,Dil Raju,Sankrantiki Vasthunnam