2024-12-05 13:59:33.0
ఆన్లైన్లో, ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఆఫర్లు వర్తిస్థాయి ప్రకటన
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్‌ను ప్రకటించింది. శుక్రవారం (ఈనెల ఆరో తేదీ) నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ సందర్భంగా పలు ఫోన్ల అమ్మకాలపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయని వెల్లడించింది. వన్ ప్లస్ 12, 12ఆర్, నార్డ్ 4 ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు వివిధ బ్యాంకుల కార్డులపై అదనపు డిస్కౌంట్లు కల్సిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వన్ ప్లస్ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా లాంటి ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌లతో పాటు రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ లోనూ ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
వన్‌ప్లస్ 12పై కంపెనీ డిస్కౌంట్ రూ.6 వేలకు అదనంగా ఐసీసీఐ, వన్ కార్డ్, ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తే ఇంకో రూ. వెయ్యి అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో తెచ్చిన ఈ ఫోన్ ధర రూ.64,999గా ఉంటుందని సంస్థ ప్రకటించింది. వన్ ప్లస్ 12ఆర్ పై సంస్థ రూ.6 వేల డిస్కౌంట్, బ్యాంకుల కార్డులపై రూ.3 వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వన్‌ప్లస్ నార్డ్ 4పై కంపెనీ డిస్కౌంట్ రూ.3 వేలు, బ్యాంకుల కార్డులపై రూ.2 వేల డిస్కౌంట్ లభించనుంది. నార్డ్ సీఈ4, నార్డ్ సీఈ 4 లైట్లపై రూ.2 వేల డిస్కౌంట్, బ్యాంకుల కార్డులతో ఇంకో రూ.వెయ్యి డిస్కౌంట్ ఇస్తున్నారు.
One Plus,Community Sale,6th December to 17th December,Huge Offers,Online,Offline Stores