Kotak Mahindra Bank | కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్‌.. కొత్త ఖాతాదారులకు.. కొత్త క్రెడిట్ కార్డుల జారీకి నో..

2024-04-24 18:37:01.0

Kotak Mahindra Bank | ప్ర‌ముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ `కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)`కు భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) (Reserve Bank of India – (RBI) గ‌ట్టి షాక్ ఇచ్చింది.

Kotak Mahindra Bank | ప్ర‌ముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ `కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)`కు భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) (Reserve Bank of India – (RBI) గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో గానీ, మొబైల్ బ్యాంకింగ్ చానెల్ ద్వారా కొత్తగా ఖాతాదారుల‌ను చేర్చుకోవ‌ద్ద‌ని కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)ను ఆర్బీఐ (RBI) ఆదేశించింది. బ్యాంకింగ్ నియంత్ర‌ణ చ‌ట్టం-1949లోని 35ఏ సెక్ష‌న్ ప్ర‌కారం త‌న‌కు సంక్ర‌మించిన అధికారాల ప్ర‌కారం కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) పై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, ఆన్‌లైన్‌లో కొత్త ఖాతాదారుల‌ను చేర్చుకోవ‌డంపైనా, కొత్త‌గా క్రెడిట్ కార్డులు కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) జారీ చేయ‌కుండా నిషేధిస్తూ సెంట్ర‌ల్ బ్యాంకు ఆదేశించింది. త‌క్ష‌ణం తమ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది.

కొత్త‌గా క్రెడిట్‌కార్డుల‌ను జారీ చేయ‌కుండా కొట‌క్ మ‌హీంద్రాబ్యాంక్ (Kotak Mahindra Bank)ను ఆదేశించింది సెంట్ర‌ల్ బ్యాంక్‌. ఇప్ప‌టికే జారీచేసిన క్రెడిట్ కార్డు క‌స్ట‌మ‌ర్ల‌కు స‌ర్వీసులు య‌ధాత‌థంగా కొన‌సాగించవ‌చ్చున‌ని ఆర్బీఐ తెలిపింది. 2022, 2023 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో బ్యాంకు ఐటీ రికార్డుల‌ను ప‌రిశీలించిన మీద‌ట‌.. కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు లావాదేవీలు ఆందోళ‌న‌క‌రంగా మార‌డంతో ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

2022,2023ల్లో నాన్‌-కంప్లియ‌న్స్ నిబంధ‌న‌ల‌ను కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్ పాటించ‌లేద‌ని ఆర్బీఐ నిర్ధారించింది. ప‌లుమార్లు దిద్దుబాటు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు అందించినా కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకు స్పందించ‌లేద‌ని పేర్కొంది. కంప్లియెన్స్ నిబంధ‌న‌ల అమ‌లులో అసంపూర్ణంగా వ్య‌వ‌హ‌రించింద‌ని, బ్యాంకు తీరులో నిల‌క‌డ లేమి క‌నిపించింద‌ని ఆర్బీఐ వివ‌రించింది.

వ‌రుస‌గా రెండేండ్లుగా ఐటీ రిస్క్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ గ‌వ‌ర్నెన్స్‌లో లోపాలు ఉన్న‌ట్ల‌యితే రెగ్యులేట‌రీ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌లేద‌ని ఆర్బీఐ స్ప‌ష్టం చేసింది. ఐటీ ఇన్వెంట‌రీ మేనేజ్‌మెంట్‌, వెండ‌ర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్ష‌న్ స్ట్రాట‌ర్జీ త‌దిత‌ర విభాగాల్లో తీవ్ర‌మైన లోపాలు ఉన్నాయ‌ని ఆర్బీఐ వివ‌రించింది.

Kotak Mahindra Bank,RBI,Banking News,Customers