2023-07-31 08:57:31.0
Ola S1 Air Bumper Offer | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా.. తన ఎస్1 ఎయిర్ స్కూటర్‌పై మరోమారు ఆఫర్ పొడిగించింది. పర్చేజింగ్ విండో కింద రూ.1,09,999లకే ఆగస్టు 15 వరకు విక్రయిస్తున్నట్లు సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు.
Ola S1 Air Bumper Offer | ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ `ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)` తన ఎస్1 ఎయిర్ (S1 Air) పర్చేజింగ్ విండో గడువు మరో 15 రోజులు పెంచేసింది. ఇంతకుముందే మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన ఎస్1 ప్రో (S1 Pro)తో పోలిస్తే ఇది అతి చౌక. కస్టమర్లందరికీ ఆగస్టు 15 వరకూ ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) ఈవీ స్కూటర్ రూ.1,09,999లకే అందిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఇంతకుముందు జూలై 30 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
కస్టమర్లతోపాటు ఓలా ఎలక్ట్రిక్ రిజర్వుడ్ కస్టమర్ల నుంచి భారీ స్పందన రావడంతో ఆఫర్ గడువు పొడిగిస్తున్నట్లు భవిష్ అగర్వాల్ వెల్లడించారు. సాధారణ కస్టమర్ల నుంచి వచ్చే ఆసక్తితో మరో 10 వేల యూనిట్లు విక్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంతకుముందు జూలై 31 నుంచి ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్ ధర రూ.1,19,999లకు విక్రయిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.
టీవీఎస్ ఐ-క్యూబ్‌తోపాటు 3వ తేదీన మార్కెట్‌లోకి రానున్న ఎథేర్ 450ఎస్ ఈవీ స్కూటర్లతో ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air) తలపడుతుందని భావిస్తున్నారు. ఓలా ఎస్1 ప్రోతో పోలిస్తే ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ విత్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఎట్ రేర్ ఉన్నాయి. రెండు వైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఓలా ఎస్1 ప్రో స్కూటర్ మాదిరే ఓలా ఎస్1 ఎయిర్ న్యూ నియాన్ గ్రీన్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది.
ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 125 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మూడు కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్‌లో గల 4.5 కిలోల హబ్ మోటార్ గరిష్టంగా 6 బీహెచ్‌పీ విద్యుత్ వెలువరిస్తుంది. కేవలం 3.3 సెకన్లలో గంటకు 40 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్తుంది. గరిష్టంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
Ola Electric,Ola