తెలుగు తెరపై సూప‌ర్ స్టార్ కృష్ణ‌ స్ఫూర్తి అజరామరం – మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ఎం.వెంకయ్యనాయుడు

2022-11-15 09:29:10.0

సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కృష్ణ న‌టించిన‌ పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలుగు తెరపై సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తి అజరామరమని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన ఆయన, సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న కృష్ణ న‌టించిన‌ పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ సూప‌ర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు తన‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సినిమాల్లో కృష్ణ ప్రయోగాలకు పెద్ద పీట వేశారని వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ రోజుల్లోనే అనేక నూతన సాంకేతికతలను తెలుగు తెరకు పరిచయం చేసి, సినిమా స్థాయిని పెంచారని ప్రశంసించారు. సగటున ఏడాదికి పది సినిమాల చొప్పున పూర్తి చేసిన కృష్ణ వేగం, ఆయ‌న‌ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆయ‌న‌ స్ఫూర్తితో కొత్తతరం సినిమా రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆకాంక్షించారు.

 

Venkaiah Naidu,Superstar Krishna Funeral Live Updates,Superstar Krishna