2022-06-06 09:15:24.0
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ డీల్‌కు ట్విట్టర్ మేనేజ్‌మెంట్ కూడా అంగీకరించింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు యాజమాన్యపు హక్కులు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే మార్చిలో ఈ డీల్ ‘హోల్డ్’లో పెట్టినట్లు కూడా మస్క్ చెప్పాడు. తాజాగా ఈ డీల్ నుంచి తప్పుకుంటానంటూ ట్విట్టర్ యాజమాన్యాన్ని సోమవారం హెచ్చరించాడు. ట్విట్టర్‌లో ఫేక్, […]
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ డీల్‌కు ట్విట్టర్ మేనేజ్‌మెంట్ కూడా అంగీకరించింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు యాజమాన్యపు హక్కులు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే మార్చిలో ఈ డీల్ ‘హోల్డ్’లో పెట్టినట్లు కూడా మస్క్ చెప్పాడు. తాజాగా ఈ డీల్ నుంచి తప్పుకుంటానంటూ ట్విట్టర్ యాజమాన్యాన్ని సోమవారం హెచ్చరించాడు.
ట్విట్టర్‌లో ఫేక్, స్పామ్ అకౌంట్లకు సంబంధించిన డేటాను ఇవ్వాలని మస్క్ ఇప్పటికే కోరాడు. అయితే తనకు సంబంధిత డేటాను ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందని.. తాను కోరిన మేరకు వివరాలు ఇవ్వకపోతే బిలియన్ డాలర్ల ఒప్పందం నుంచి వైదొలుగుతానని మస్క్ ఒక లేఖ పంపించారు.
విలీన ఒప్పందంలో భాగంగా తనకు ఉన్న హక్కులను నెరవేర్చడంలో ట్విట్టర్ విఫలమవడం అవడం అంటే కాంట్రాక్టును గౌరవించకపోవడమే అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ట్విట్టర్ కావాలనే తన సమాచార హక్కును ప్రతిఘటించి, డేటాను ప్రొవైడ్ చేయడానికి నిరాకరిస్తున్నట్లు మస్క్ భావిస్తున్నట్లు ఆయన లాయర్లు అంటున్నారు.
వీలైనంత త్వరగా విలీన ఒప్పందంలో భాగంగా ఉన్న నిబంధనలను అనుసరించి డేటాను అందజేయాలని కోరుతున్నారు. మస్క్ ఈ ప్రకటన చేసిన వెంటనే ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విట్టర్ షేర్ 5.5 శాతం పడిపోయి 37.95 వద్ద ట్రేడ్ అవుతున్నది.
Company doesn’t provide data,Dropping,Elon Musk,Twitter Deal,warns