కేటీఆర్ ట్వీట్.. క్షణాల్లో కదిలిన యంత్రాంగం..

2022-06-15 05:06:38.0

బాసరలోని ఆర్జేయూకేటీలో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ట్వీట్ చేసిన వెంటనే అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి అడుగులు వేసింది. బాసరలోని ఆర్జేయూకేటీలో సమస్యలపై స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన కేటీఆర్.. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్టు భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ఆందోళన […]

బాసరలోని ఆర్జేయూకేటీలో విద్యార్థుల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ట్వీట్ చేసిన వెంటనే అధికార యంత్రాంగం సమస్య పరిష్కారానికి అడుగులు వేసింది. బాసరలోని ఆర్జేయూకేటీలో సమస్యలపై స్పందించాలంటూ బత్తిని తేజగౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి బదులిచ్చిన కేటీఆర్.. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నట్టు భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

మంత్రి ఇలా ట్వీట్ చేశారో లేదో.. వెంటనే విద్యాశాఖ మంత్రి సబిత స్పందించారు. బాసర ఆర్జీయూకేటీ సమస్యలపై వీసీతో సమావేశమవుతున్నట్లు ఆమె ప్రకటించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అటు అధికారులు కూడా వెంటనే ఆర్జేయూకేటీ సమస్యలపై దృష్టిపెట్టారు. విద్యార్థులతో మాట్లాడేందుకు, వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసలేంటీ గొడవ..

బాసరలోని ఒకప్పటి ట్రిపుల్ ఐటీ.. ప్రస్తుత రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT)లో మౌలిక వసతుల కోసం విద్యార్థులు మంగళవారం నుంచి ఆందోళన మొదలు పెట్టారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు మరోసారి తమ సమస్యల పరిష్కారానికి ముందుకు కదిలారు. అయితే ఈసారి అధికారులు దిగొచ్చే వరకు వెనక్కి తగ్గ కూడదని నిర్ణయించుకున్నారు. యూనివర్శిటీలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్యం నిర్లక్ష్యంపై వారు ఆందోళన చేపట్టారు. సుమారు 6వేల మంది విద్యార్థులు మెయిన్‌ గేటు వద్ద బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు.

తెలంగాణ ఆవిర్భావం నుంచి ఆర్జీయూకేటీకి శాశ్వత వీసీ నియామకం జరగలేదు. ఇన్ చార్జ్ లతో నెట్టుకొచ్చారు. మూడేళ్లుగా విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌ ల సరఫరా ఆగిపోయింది. యూనిఫాం పంపిణీ కూడా లేదు. భోజనం నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో విద్యార్థులంతా సడన్ గా ఆందోళనకు సిద్ధమయ్యారు. నిన్న, ఈరోజు ఉధృతంగా నిరసన తెలియజేశారు. సీఎం కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ.. స్వయంగా ఆర్జేయూకేటీకి వచ్చి తమ సమస్యలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వీరి సమస్యలపై దృష్టి పెట్టారు. ఆయన ట్వీట్ తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.

 

Help for protesting students,KTR,Minister KT Rama Rao,RGUKT Basra