2022-06-17 02:10:37.0
హైదరాబాద్ కు తాకిన ‘అగ్నిపథ్’ నిరసనలతో సికిందరాబాద్ లో హింస చెలరేగింది…. పోలీసు కాల్పుల్లో దామోదర్ అనే వ్యక్తి మరణించాడు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇవ్వాళ్ళ సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళి న వేలాది మంది యువకులు రెండు రైలు బోగీలకు నిప్పుపెట్టారు. స్టేషన్ బైట పలు బస్సులకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా ఆందోళనకారులు ఆగకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దామోదర్ […]
హైదరాబాద్ కు తాకిన ‘అగ్నిపథ్’ నిరసనలతో సికిందరాబాద్ లో హింస చెలరేగింది…. పోలీసు కాల్పుల్లో దామోదర్ అనే వ్యక్తి మరణించాడు. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇవ్వాళ్ళ సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళి న వేలాది మంది యువకులు రెండు రైలు బోగీలకు నిప్పుపెట్టారు. స్టేషన్ బైట పలు బస్సులకు నిప్పు పెట్టారు.
ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయినా ఆందోళనకారులు ఆగకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దామోదర్ అనే వ్యక్తికి ఛాతిలో బుల్లెట్ దూసుకపోయింది. ఆయనను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోలీసుల లాఠీచార్జ్ లో అనేక మంది యువకులకు గాయాలయ్యాయి. గాయపడినవారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
‘Agneepath’ protests,’Agneepath’ protests in Hyderabad,Agneepath scheme announced,Police Firing,Police firing in Secunderabad,police opened fire,secunderabad railway station,Violence erupts in Secunderabad