‘మోదీ ఇక్కడ ఉపన్యాసాలిచ్చే ముందు తెల‍ంగాణ అమరులకు క్షమాపణలు చెప్పాలి’

2022-07-01 01:31:47.0

పార్లమెంటులో , బైట తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోగలరా ? తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్న మాటలు తెలంగాణ ప్రజలకు గుర్తులేవా ? అప్రజాస్వామికంగా, పార్లమెంటు తలుపులు మూసి, బలవంతంగా విభజన బిల్లు పాస్ చేశారని మోదీ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగం ఆయన మర్చిపోవచ్చేమో గానీ తెలంగాణ ప్రజల చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి తెలంగాణ వ్యతిరేకి మోదీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులు […]

పార్లమెంటులో , బైట తెలంగాణకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోగలరా ? తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అన్న మాటలు తెలంగాణ ప్రజలకు గుర్తులేవా ? అప్రజాస్వామికంగా, పార్లమెంటు తలుపులు మూసి, బలవంతంగా విభజన బిల్లు పాస్ చేశారని మోదీ పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రసంగం ఆయన మర్చిపోవచ్చేమో గానీ తెలంగాణ ప్రజల చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి.

అలాంటి తెలంగాణ వ్యతిరేకి మోదీ ఇప్పుడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ఉపన్యసిస్తారు. మరి దీనికి ముందు ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలపై వివరణ ఇస్తారా ? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలిచ్చిన అమరులకు, ప్రజలకు క్షమాపణ చెప్తారా ?

ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్నలు. మోదీ గతంలో మాట్లాడిన వీడియోలను పోస్ట్ చేస్తూ మోదీ తెలంగాణ అమరులకు క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహా అనేక మంది నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.

”తెలంగాణ ఏర్పాటుపై పదే పదే నిప్పులు చెరిగిన వ్యక్తి తెలంగాణకు వస్తున్నారు.

మోదీ జీ, ముందుగా తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి, కేంద్ర పన్నుల్లో మా హక్కు వాటాను కేటాయించండి, AP పునర్వ్యవస్థీకరణ చట్టం వాగ్దానాలను అమలుపర్చండి, ఆ తర్వాత ఇక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించండి.” అని పుట్టా విష్ణు వర్ధన్ రెడ్డి అనే నెటిజన్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో కూడా షేర్ చేశారు.May be an image of 5 people, people standing and text that says "KTR Retweeted Putta Vishnuvardhan Reddy @PuttaVishnuVR Time & again, the man who fired salvos at Telangana formation is coming to #Telangana Modi ji, first apologize to the martyrs & people of Telangana devolve our rightful share in Central Taxes, keep up the AP ReOrg Act promises, & then address the public. #ByeByeModi @KTRTRS విశ్వగురు కాదు తెలంగాణ ఏరా టుపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని మోదీ మొన్న నిన్న నేడు Watch Watchagain again 0:00 4,950 views"

”తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విమర్శించిన వ్యక్తి రాజకీయాల కోసం తెలంగాణకు వస్తున్నారు.
ఆయన అమరవీరులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మీకు అనిపించడంలేదా?” అని టీఆరెస్ నేత‌ క్రిషాంక్ ట్వీట్ చేశారు. దానితో పాటు మోదీ పార్లమెంట్ లో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.May be an image of 5 people and text that says "krishanKTRS @krishanKTRS The man who criticized creation of Telangana State is coming to Telangana for Politics.. Dont you think he should apologise the Martyrs and people of Telangana? @KTRTRS మొన్న ఆత్మగౌరవంపై దాడి! నిన్న నేడు 1:03 38 vews 10:04 PM Jun 30, 2022 Twitter for Android 119 Retweets 3 Quote Tweets 450 Likes"

తెలంగాణ అమరులకు, ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలనే ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది నెటిజనులు ByeByeModi హ్యాష్ ట్యాగ్ తో ఈ ట్వీట్లను షేర్లు చేస్తున్నారు.

 

krishank,KTR,Narendra Modi,Telangana,telangana martyrs,Tweet,Twitter,viral