ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం

2025-03-03 04:40:00.0

ట్యాంక్‌బండ్‌ సమీపంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఫుడ్ పాత్ పైకి ఎక్కింది. ఇవాళ ఉదయం ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు ఓ కారు వస్తుండగా ఎన్టీఆర్ ఘాటు మలుపు వద్ద అతివేగంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అనంతరం కారు డివైడర్ మీదకు దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొట్టగా పోల్ రోడ్డుపై అడ్డంగా విరిగి పడింది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. అర్థరాత్రి సమయంలో ప్రమావదం జరిగింది. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

NTR Ghat,Hyderabad,Tankbund,Khairatabad Junction,Secretariat,Crime news,CM Revanth reddy,Telangana police