సీసీ రోడ్ల క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు : మంత్రి సీతక్క

2025-02-26 13:59:06.0

గ్రామీణ రోడ్ల నాణ్యతపై రాజీ పడేది లేదని మంత్రి సీతక్క అన్నారు.

గ్రామీణ రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క అన్నారు. గ్రామీణ రహదారి పనుల పురోగతిపై హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. సీసీ రోడ్లు నాసిరకం పనుల పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం పనులు జరిగిన చోట బిల్లులు ఎలా చెల్లించారని, క్వాలిటీ సర్టిఫికెట్లు ఎలా మంజూరు చేశారని ఫైర్‌య్యారని తెలుస్తోంది. క్వాలిటీ కంట్రోల్ టీములను తక్షణం ఆయా ప్రాంతాలకు పరిశీలనకు పంపాలని ఆదేశించినట్లు తెలిసింది. గ్రామీణ రహదారుల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడేది లేదని, నాణ్యత లోపాలపై నివేదికలు తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాంట్రాక్టర్లు, ఏ స్థాయిలో ఉన్న వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నాసిరకం పనులు చేసిన చోట సస్పెన్షన్లు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, ఈఎన్‌సీ కనక రత్నం హాజరయ్యారు.

Minister Sitakka,Panchayat Raj Rural Development Department,CC roads,Rural roads,CM Revanth reddy,Telangana goverment,Quality Certificates,Secretary Lokesh Kumar