2025-02-25 15:30:18.0
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఈనెల 27న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు.
తెలంగాణలో ఈనెల 27న ఎమ్మెల్సీలు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. 27న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అమూల్యమైన ఓటు వేసేందుకు పట్టభద్రులందరికీ అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందన్నారు. కానీ, చాలా కళాశాలలు, పాఠశాలల్లో ఓటు హక్కు కలిగిన సిబ్బందికి కొన్ని గంటలు మాత్రమే అనుమతి ఇస్తామని చెబుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఓ ప్రకటనలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులకు ఏడాదిలో అందించే సెలవులకు, వీటికి సంబంధం లేకుండానే పోలింగ్ రోజు పబ్లిక్ హాలిడే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు
Telangana,holiday,schools and colleges,MLC elections,Bandi Sanjay,Special Casual Leave,Election of Graduates MLC,CM Revanth reddy,Congress party,KCR,KTR,BRS Party