ఎస్సీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలి : మంద కృష్ణ మాదిగ

2025-02-11 10:24:46.0

ఎస్సీ వర్గీకరణలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లానని కృష్ణ మాదిగ అన్నారు

ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలులో ఉప కులాల రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన నివేదికపై చర్చలో ఆయన పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై చట్ట సభలో తీర్మానం చేసినందుకు గాను ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఉప కులాల్లో రిజర్వేషన్ల శాతం, గ్రూపుల విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లానని అన్నారు. అదేవిధంగా కులగణన లోపాలను సైతం సీఎం వివరించానని తెలిపారు. ఉపకులాల్లో ఏ, బీ, సీ మాత్రమే చేశారని.. తాము నాలుగు గ్రూపులుగా చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థించామని మంద కృష్ణ అన్నారు.జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికలో కొన్ని లోపాలుని ఆయన అన్నారు.

CM Revanth Reddy,manda Krishna Madiga,Justice Shamim Akhtar,SC Classification,MRPS,Former MP Venkatesh netha