2025-02-07 14:22:12.0
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగుతుండటంతో బ్యాంక్ సేవలు రెండు రోజులు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా బ్యాంకుతో అవసరాలు ఉంటూనే ఉంటాయి. కొందరు లోన్ కోసం వెళితే.. మరికొందరు డబ్బులు దాచుకోవడానికి వెళ్తుంటారు. ఇలా ఆర్థిక అవసరాలతో ముడిపడి ఉన్న ప్రతి అంశానికి బ్యాంకులో ప్రధాన ఆధారంగా కనిపిస్తుంటాయి.
మార్చి నెలలో 24,25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ధర్నాకు దిగుతుండటంతో బ్యాంక్ సేవల అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. దీంతో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 5 రోజుల పని దినాలు, కొత్త జాబ్స్, రివ్యూ ను తొలగించడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల జీతం వరకు ఐటీ మినహాయింపు డిమాండ్లను నేరావేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Bank Services,RBI,Work Days,News Jobs,DFS,United Forum of Bank,Savings Account,Salary Account