2025-02-07 14:05:48.0
ఎస్సీ వర్గీకరణ తీర్మానంను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టినందుకు ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాలు మంత్రి దామోదర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ వర్గీకరణ నిర్ణయంపై ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ప్రతినిధులు స్వాగతించారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం ను అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల ఇవాళ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని హైదరాబాదులో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ చేసిన కృషిని డక్కలి కళాకారుడు పోచప్ప పాటగా మలిచి మంత్రికి వినిపించారు. ఈ సందర్భంగా డక్కలి పోచప్పా 12 మెట్ల కిన్నెరను మంత్రి పరిశీలించారు. పాచప్ప అభ్యర్థన మేరకు 12 మెట్ల కిన్నెరను మంత్రి దామోదర్ రాజనర్సింహ వాయించి అందరినీ ఆకట్టుకున్నారు.
MBSC castes,Minister Damodar Rajanarsimha,artist Pochappa,CM Revanth reddy,Telangana goverment,Congress goverment,SC Classification,MRPS,Manda krishna madiga