కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నపై కేసు

2025-02-07 12:18:59.0

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నపై అల్వాల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్నపై అల్వాల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ నెల 4న వరంగల్‌లో జరిగిన బీసీ సభలో ఆయన అగ్రవర్ణాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేతల కంప్లైంట్‌తో మల్లన్నపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్ట‌ర్ రాహుల్ దేవ్ తెలిపారు.వరంగల్‌ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ.. ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు టీపీసీసీ షోకాజ్‌ నోటీసులు గురువారం జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

కుల గణన నివేదికపై మల్లన్న కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కుల గణన సర్వేలో బీసీల సంఖ్య తగ్గించినట్లుగా చూపించడంపై ఆయన సొంత హస్తం పార్టీపైనే తీవ్రంగా విమర్శించారు. సర్వేను తప్పుపడుతూ తీవ్ర పదజాలంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కుల గణన నివేదికను సైతం తగులబెట్టాలని పిలుపునిచ్చారు. నవీన్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. బీసీ జనాభా తగ్గడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

MLC Theenmar Mallanna,Congress Party,Inspector Rahul Dev,TPCC,Caste enumeration,CM Revanth reddy,Congress goverment,Police Case,Congress,Telangana,Alwal Police Station