ఫిబ్రవరి 7న శాసనసభ ప్రత్యేక సమావేశం!

2025-01-30 13:12:39.0

తెలంగాణ శాసనసభ సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీ రిజ్వేషన్ల పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కుల గణన సర్వే ఈ తుది నివేదికను 2025, ఫిబ్రవరి 2న కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. కుల గణన సర్వే రిపోర్టుపై కేబినేట్ ఉప సంఘం చర్చించి తుది నివేదికను ఆమోదం కోసం కేబినెట్‎కు పంపనుంది.

2025, ఫిబ్రవరి 5వ తేదీన మంత్రి వర్గం ప్రత్యేకంగా భేటీ అయ్యి.. కులగణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. అనంతరం ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం శాసన సభ ఆమోదం తెలపనున్నారు.

Telangana assembly meetings,CM Revanth reddy,Special Assembly Session,Cabinet Sub Committee,Census,BC Reservations,minister sridhar babu