జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మికి మరో భారీ షాక్

2025-01-29 15:26:13.0

జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మికి భారీ షాక్ తగిలింది.

హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో భారీ షాక్ తగిలింది. బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో గల భూమిని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు తక్కువ ధరకు కట్టబెట్టారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ ల్యాండ్‌ని జీవో నంబర్ 56 ద్వారా కె.కె. కుటుంబానికి క్రమబద్ధీకరించారని రఘువీర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రెవెన్యూ అధికారులు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవితలను చేర్చారు.

ఈ భూమిని తక్కువ ధరకు కేటాయించారని, ఈ స్థల కేటాయింపునకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌‍ పై సీజే ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ విచారణ చేపట్టారు

Hyderabad Mayor,Gadwala Vijayalakshmi,K Keshavarao,Telangana High Court,PIL,Justice Sujoy Paul,CM Revanth reddy,Telangana goverment,CS Shanthikumari,GHMC