2025-01-28 11:10:55.0
గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు దారుమని గద్దర్ కుమార్తె వెన్నెల ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రజా యుద్ద నౌక గద్దర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల ఖండించారు. పదవులు , డబ్బు , అవార్డుల కోసమో గద్దర్ పని చేయలేదు. తెలంగాణ ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాడాని ఆమె అన్నారు. శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని కూడా ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్ అని మీరు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రన ఆయన స్ధాయి తగ్గదుని వెన్నెల అన్నారు. దేశంలో అవార్డులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమా లేక బీజేపీనా అని ఆమె ప్రశ్నించారు.
గద్దర్ పై విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మెయడం వంటిదేనన్నారు. గద్దర్ ఓ చారిత్రాత్మక వ్యక్తి..యుగ పురుషుడని కొనియాడారు. ప్రజల పాటగా ఆయన చిరస్మరణీయుడని..ఆయన స్థాయిని అవార్డులు నిర్ణయించలేవన్నారు. వివిధ రంగాల్లో దేశానికి సేవలందించిన ప్రముఖులను గుర్తించి ఇచ్చేందుకు తగిన మార్గదర్శకాలు ఉన్నాయని, అలాంటప్పుడు బండి సంజయ్ తమ పార్టీ కార్యకర్తలను చంపినోళ్లకు అవార్డులు ఎలా ఇస్తారంటూ మాట్లాడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు.
Gaddar,Union Minister Bandi Sanjay,LTT Prabhakaran,Naeem,Padma Award,Maoist Party,Vennala Gaddar,BJP,CM Revanth reddy,People of Telangana