సొంత జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టికి భారీ షాక్

2025-01-26 05:39:40.0

పైలెట్ ప్రాజెక్టు గ్రామాన్ని మార్చడంతో గ్రామస్తులు అధికారులను గదిలో బంధించారు

సొంత జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు షాక్ తగిలింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాల అమలులో భాగంగా ఎంపిక చేసిన పైలెట్ ప్రాజెక్టు గ్రామాన్ని మార్చడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తహిల్దర్,ఇతర ప్రభుత్వ అధికారులను ఖానాపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో పెట్టి తాళం వేశారు. ఖమ్మం – గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి జనవరి 26 నుంచి నుంచి నాలుగు పథకాలను అమలుచేయనుండగా.. ఆ గ్రామంలో కొందరు చొప్పున లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈమేరకు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఖానాపురాన్ని మొదట ఎంపిక చేసినట్లు ప్రకటించగా తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, ఎంపీఓ వాల్మీకి కిశోర్ ఆధ్వర్యంలో శనివారం నుంచి సర్వే మొదలు పెట్టారు.2 గంటల పాటు సర్వే చేశాక రాత్రి 9 గంటల సమయంలో మండలంలో పైలట్ గ్రామంగా ఖానాపురం బదులు సువర్ణాపురాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం అందింది. దీంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న అధికారులు బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. ఆగ్రహించిన గ్రామస్తులు తమ గ్రామాన్ని ఎలా రద్దు చేస్తారంటూ కార్యాలయ గేట్లకు తాళం వేశారు.

Deputy CM Bhatti Vikramarka,Telangana Goverment,CM Revanth reddy,Four schemes,pilot project,Proceedings,Tehsildar Sunita Elizabeth,MPDO Sridhar Swamy,MPO Valmiki Kishore,Telanagan goverment,Khammam District,Khanapuram