2025-01-25 15:46:20.0
కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు వ్యవస్ధపై అవగాహన లేదని విమర్శించారు. బండి సంజయ్ కి రాజకీయ అనుభవం తక్కువ.. అనుభవం లేకున్నా మంత్రి పదవులు వస్తున్నాయి. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. బీజేపీ అధ్యక్షుడు గా… ఏం మాట్లాడినా చెల్లింది. కేంద్ర మంత్రిగా ఏం మాట్లాడాలో నేర్చుకుంటే మంచిది.
కేంద్రం కి నిధులు ప్రజలు కట్టిన పన్నుల వల్లనే అనేది మర్చిపోకు. బ్రేకింగులు పడాలని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ రావాలని మాట్లాడే వాళ్ల లో బండి సంజయ్ ముందు ఉంటాడు. తెలంగాణ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు బండి సంజయ్. ఇండ్లకు డబ్బులు ఇయ్యవా.. బియ్యం కూడా అయ్యాను అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీకి గులాం చేస్తేనే తెలంగాణకు నిధులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు
Bandi Sanjay,Jaggareddy,PM MODI,TPCC chief Mahesh Kumar Goud,Indira Gandhi,Ration card,Davos,Congress Goverment