కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే మీకేం ప్రాబ్లం : ఎమ్మెల్యే గూడెం

2025-01-23 15:27:45.0

రేవంత్ రెడ్డి ఫోటో నాకిష్టమైతే పెట్టుకుంటా.. లేకుంటే లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు

నా ఇష్టం బరాబర్ నేను కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా తప్పేంటని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఫోటో నాకిష్టమైతే పెట్టుకుంటా.. లేకుంటే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నదే నా ఆశయం. కానీ వరుసగా రెండుసార్లు ప్రజలు తిరస్కరించిన కాటా శ్రీనివాస్ నా కార్యాలయంపై దాడికి పాల్పడడం సరికాదు. నేనేమీ చేతులకు గాజులు తొడుక్కోలేదు’ అని ఆయన హెచ్చరించారు. మూడుసార్లు ఓడినా కాటా శ్రీనివాస్ గౌడ్ కు కనీసం సిగ్గు లేదని ఘాటుగా విమర్శించారు.పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు.

క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే ఇళ్లు లాంటిది. దానిపై దాడి చేయటం దారుణం. కొందరు చీప్ మెంటాలిటితో పని చేస్తున్నారు. క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. కాగా, పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గంలోని ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ నిరసనకు పిలుపునిచ్చారు

MLA Goodem Mahipal Reddy,Congress party,Kata Srinivas,Patancheru Constituency,telangana goverment,CM Revanth reddy,BRS Party,KTR,KCR,Minister Damodar Rajanarasimha,Neelam madu