2025-01-20 12:55:22.0
సీఎంఆర్ కాలేజీ బృందం రాష్ట్ర మహిళా కమిషన్ విచారణ జరిపింది
సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ స్నానాల గదిలో సీసీ కెమోరాలు ఏర్పాటు చేసిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలన రేపిన సంగతి విదితమే. తాజాగా మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ కాలేజీ బృందం రాష్ట్ర ఉమెన్ కమిషన్ విచారణ జరిపింది. విచారణ అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎదుట విచారణకు హాజరయ్యాం. సీసీ కెమెరాల ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్తామని తెలిపారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీహార్ కు చెందిన నందకిషోర్, గోవింద్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు గమనించిన విద్యార్థినులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొద్ది రోజుల పాటు ఆందోళనలు సైతం చేశారు. విద్యార్థినులు ఆందోళన చేయడంతో హాస్టల్ వార్డెన్ ప్రీతిరెడ్డిని యజమాన్యం సస్పెండ్ చేసింది.
CMR College,Telanagana Womens Commission,Engineering College Hostel,Mla mallareddy,Marri Rajasekhar Reddy,Nerella Sharada,Warden Prithi Reddy