గ్రూప్‌-2 ప్రాథమిక ‘కీ’ విడుదల

2025-01-18 11:23:17.0

18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాల స్వీకరణ

రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 15,16 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక ‘కీ’ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమినరీ ‘కీ’తో పాటు మాస్టర్‌ ప్రశపత్రాన్ని ఈ నె 22 వరకు టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ఇ. నవీన్‌ నికోలస్‌ తెలిపారు. అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. అభ్యంతరాలను ప్రత్యేకంగా పొందుపరిచి లింక్‌ ద్వారా ఇంగ్లీష్‌లో నమోదు చేసి, ఆధారాలను జత చేయాలన్నారు. ఇతర పద్ధతుల్లో ఇచ్చిన అభ్యంతరాలను, గడువు తేదీ ముగిసిన తర్వాత అందిన విజ్ఞప్తులను పరిగణించబోమని స్పష్టం చేశారు. 

https://websitenew.tspsc.gov.in/viewKeyObjections?accessId=Ngy2uweFgyu3we2822

Group-2,Primary ‘key ‘release,TGPSC,Aspirants,Objections on ‘key’