ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిర్వహణ లోపంపై లోకేశ్‌ అసంతృప్తి

2025-01-18 10:35:12.0

ఎన్టీఆర్‌ ఘాట్‌ నిర్వహణపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై ఏపీ మంత్రి లోకేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్‌ ఘాట్‌కు లోకేశ్‌ వెళ్లారు. ఘాట్‌ గోడలు, పైకప్పు పెచ్చులూడిపోవడం, గార్డెన్‌లో ఏర్పాటు చేసిన లైట్లు విరిగిపడి ఉండటాన్ని గమనించారు.

ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని సొంత నిధులతో మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఎన్టీఆర్ నిర్వహణ బాధ్యతలు తమకు అప్పగించలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ ట్రస్ట్‌ గతంలో విజ్ఞప్తి చేసింది. సొంత నిధులతో ఈ పనులు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పనులను వెంటనే ప్రారంభించాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు

NTR Ghat,Minister Lokesh,Telangana Goverment,NTR Trust,HMDA,CM Revanth reddy,TDP,CM Chandrababu