2025-01-18 05:54:58.0
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల కపట ప్రేమ చూపెడుతూ నాటకాలు ఆడుతున్నదన్న కిషన్‌రెడ్డి
భారత రాజ్యాంగంపై కాంగ్రెస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో జరిగిన ‘సంవిధాన్ గౌరవ్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పుల చేసుకుంటూ అనేకసార్లు అవమానపరిచిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల కపట ప్రేమ చూపెడుతూ నాటకాలు ఆడుతున్నదని మండిపడ్డారు. మేము కూడా అధికారంలోకి వచ్చాక రాజ్యాంగంలో మార్పులు చేశాం. అవి దేశం కోసం, దేశ అవసరాల కోసం సవరణలు చేశామన్నారు. గణతంత్ర దినోత్సవం నుంచి ఏడాదిపాటు నిర్వహించనున్న భారత రాజ్యాంగ గౌరవ్ అభియాన్‌లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ చీకటి చరిత్రను వివరిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
Union Minister Kishan Reddy,Participated,In Samvidhan Gaurav Abhiyan Program,Fire on Congress