2025-01-17 15:25:25.0
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ మంజూరు చేస్తామని రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్థిదారుల ఎంపికపై సచివాలయంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్మి శాంతికుమారితో కలిసి సమీక్షించారు. మొదటి విడతలో ఇండ్ల స్థలం ఉన్నవారికి, రెండో విడతలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇంజినీరింగ్ విభాగాన్ని సమకూర్చుకోవడం, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకం, సర్వేయర్ల నియామకంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇందిరమ్మ ఇండ్లకు సొంత స్థలం ఉన్నవారి జాబితా, నివాస స్థలం లేని వారి జాబితాలను వేర్వేరుగా గ్రామసభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజినీర్లు అవసరమని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇతర ప్రభుత్వ విభాగాల్లోని ఇంజినీరింగ్ సిబ్బంది సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు వంటి అంశాలను పరిశీలించాలని సీఎస్ కి మంత్రి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Minister Ponguleti Srinivasa Reddy,Indiramma’s house,CS Shantikumari,GHMC,Naveen Mittal,Housing Secretary Jyoti Buddha Prakash,Housing Corporation MD VP Gautam,GHMC Commissioner Ilambarti