ఏఎస్‌ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు

2025-01-16 11:26:41.0

ఫార్మూలా-ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో ఏఎస్‌ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

ఫార్మూలా-ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో ఏఎస్‌ నెక్ట్స్‌ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా గ్రీన్ కో ఎండీ అనిల్‌కి సైతం నోటిసులిచ్చింది. ఫార్మూలా ఈ కారు కేసు ఒప్పందంపై ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఆర్‌బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్‌ పౌండ్స్‌ రూపంలో నిధులు చెల్లించడంపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు.ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ ఎన్‌ రెడ్డిలను ప్రశ్నించారు. ఆర్థిక శాఖ నుంచి కానీ కేబినెట్‌ ఆమోదం కానీ లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు మనీ లాండరింగ్‌ కిందకు వస్తుందన్నది ఈడీ వాదన.

ACB Notices,AS NEXT COMPANY,Formula-E race case,Telangana Assembly Elections,BRS Party,KP Vivekananda,High Court,MLA Padi Koushik Reddy,party defections,KTR,Kadiam Srihari,Tellam Venkatarao,Dana Nagender,CM Revanth reddy,Congress party