2025-01-05 11:32:56.0
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్కి ప్రమాదం జరిగింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. వరంగల్‌కు వెళ్లున్న క్రమంలో జనగామలోనిపెంబర్తి కళాతోరణం వద్ద ఉపముఖ్యమంత్రి కాన్వాయ్ లోని పోలీస్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ట పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.
ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, కారు డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం భట్టి వరంగల్ పర్యటనకు బయలు దేరారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Deputy CM Bhatti Vikramarka,Road Accident,Police vehicle,Warangal tour,Pembarthi Kalathoranam,Janagama,SI Chennakesavulu,CM Revanth reddy,DGP Jitender,Telangana police