మోసానికి మేకప్ వేస్తే అది సీఎం రేవంత్ : కేటీఆర్‌

2025-01-05 05:59:14.0

రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు

రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి విమర్శించాలు గుప్పించారు. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇదే సమయంలో రైతు భరోసాకు సంబంధించి సీఎం రేవంత్‌ మాట్లాడిన వీడియోను కేటీఆర్‌ షేర్‌ చేశారు. అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారని గుర్రం..గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ! అన్న పద్య రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందంటూ ఎద్దేవా చేశారు. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్..మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వమని కేటీఆర్ వంగ్యాస్త్రాలు వేశారు.

మోసానికి మారు పేరు కాంగ్రెస్..ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ .రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్..రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు. ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం..అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దమని మండిపడ్డారు. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం..ప్రచారం రూ.15 వేలు..అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు అని..సిగ్గు సిగ్గు ఇది సర్కారు కాదు..మోసగాళ్ల బెదిరింపుల మేళా అంటూ విమర్శించారు. అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్..మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అని కేటీఆర్ దుయ్యబట్టారు. అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్.. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్! అంటూ కామెంట్స్‌ చేశారు.

CM Revanth reddy,KTR,Rythu Bharosa,Warangal Declaration,Election Promises,BRS Party,KCR,Congress Party,Indiramma Bharosa,Harish rao