ఈసారి న్యూఇయర్‌ కిక్కే వేరబ్బా

2025-01-01 06:17:04.0

వారం రోజుల్లోనే రూ. 1700కోట్ల మద్యం అమ్మకాలు

కొత్త సంవత్సరం వేళ తెలంగాణ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. గడిచిన వారం రోజుల మద్యం డిపోల నుంచి దుకాణదారులకు సరఫరా అయిన మద్యం తీసుకుంటే ప్రతి రోజు సుమారు రూ. 200 కోట్ల విలువైన మద్యం సరఫరా అయినట్లు తెలుస్తోంది.

గడిచిన వారంలో ఏకంగా రూ. 1700 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. గత నెల 23న 193 కోట్లు, 24న 197 కోట్లు, 26న రూ. 192 కోట్లు , 27న రూ. 187 కోట్లు, 28న రూ. 191 కోట్లు , 30న ఏకంగా రూ. 402 కోట్లు, 31న 282 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2023 డిసెంబర్‌ చివరి వారంలో 1510 కోట్ల మద్యం విక్రయాలు జరిగగా.. ఈసారి రూ. 200 కోట్లు అదనంగా అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ అధికారులు తెలిపారు. గత డిసెంబర్‌లోనే రూ. 3,805 కోట్ల లిక్కర్‌, బీరు అమ్ముడుపోయాయి. గత సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్‌ వరకు తీసుకుంటే ఏకంగా రూ. 37,682 కోట్ల విలువైన 3.76 కోట్ల లిక్కర్‌ కేసులు, రూ. 5.47 కోట్ల కేసుల బీర్లు అమ్మడుపోయినట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి. 

Liquor Sales New Record,In Telangana,At New Year Night,Telangana records Rs.402 Crores in liquor sales,New Year Celebrations