బడ్జెట్‌ కు కౌంట్ డౌన్‌ షురూ

2024-12-31 14:27:53.0

బడ్జెట్‌ ఎస్టిమేట్స్‌ ఇవ్వాలని అన్ని శాఖలను కోరిన ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌

తెలంగాణ బడ్జెట్‌ 2025 -26కు కౌంట్‌ డౌన్‌ షురువయ్యింది. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ శాఖలకు సంబంధించిన బడ్జెట్‌ ఎస్టిమేట్స్‌ తో పాటు 2024 – 25కు సంబంధించిన రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ ను సమర్పించాలని కోరింది. ఆయా వివరాలను నిర్దేశితా ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌ లో సబ్మిట్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. జీతాలు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ చెల్లింపులకు సంబంధించిన అన్నిరకాల పద్దులను జనవరి 4వ తేదీలోపు తమకు పంపాలని కోరింది. ఈమేరకు ఫైనాన్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Budget,2025-26,Budget Estimates,Revised Estimates,Finance Department