మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌

2024-12-27 10:08:48.0

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్న మన్మోహన్ నివాసంలో ఆయన భార్య గురు శరణ్ కౌర్, కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్మించారు. దేశంలోనే గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడని కోల్పోయిందని ఆయన మరణం ఎంతో బాధాకరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తన రాజకీయ, ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన భూమి పుత్రుడిని దేశం కోల్పోయింది. మన్మోహన్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని తెలిపారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ , మంత్రి దామోదర రాజనర్సింహ , ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, పార్టీ నేతలు సంపత్ కుమార్, జేడీ శీలం తదితరులు ఉన్నారు.

CM Revanth reddy,Manmohan Singh,Former Prime Minister,Passed away,Rural Employment Guarantee,Aadhaar,RTI,Right to Education Act,Rahul gandhi,Sonia gandhi