అల్లు అర్జున్‌ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న

2024-12-23 06:21:19.0

ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదన్నమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సినీ నటుడు అల్లు అర్జున్‌ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని మంత్రి పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు. సంధ్య థియేటర్‌ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉన్నదని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

ఓయూ జేఏసీ నేతలకు బెయిల్‌ మంజూరు

మరోవైపు సినీ నటుడు అల్లు అర్జున్‌ ఇంటివద్ద ఆందోళన కేసులో అరెస్టయిన ఓయూ జేఏసీ నేతలకు బెయిల్‌ మంజూరైంది. వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్‌ పోలీసులు హాజరుపరిచారు. వారికి న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. ఒక్కొక్కరు రూ. 10 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.